: గడ్డకట్టుకుపోతున్న అమెరికా


అమెరికా కనీవినీ ఎరుగని చలిని చవిచూస్తోంది. ఉష్ణోగ్రతలు మైనస్ 27 డిగ్రీలకు పడిపోవడంతో.. నదులు కూడా గడ్డకట్టుకుపోతున్నాయి. ధ్రువప్రాంతాల నుంచి వీస్తున్న భీకరమైన చల్లటి గాలులే ఈ గడ్డు పరిస్థితులకు కారణం. దీంతో దక్షిణ, తూర్పు అమెరికా, కెనడాలు వణికిపోతున్నాయి. డీప్ ఫ్రీజర్ లో పెట్టినట్లుగా ఆ ప్రాంతాలన్నీ చలికి గడ్డకట్టుకుపోతున్నాయి. నదులు, సరస్సులన్నీ ఇప్పటికే మంచుముద్దలుగా మారిపోయాయి. షికాగోలో మైనస్ 27, ఫోర్ట్ వేన్, ఇండియానాలో మైనస్ 25 డిగ్రీలు, భారతీయులు ఎక్కువగా నివసించే న్యూజెర్సీలో మైనస్ 14 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

ఇండియానాలో 30 సెంటీమీర్ల మేర మంచు కురిసింది. 2,500కుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎముకలు కొరికే చలి ఉండడంతో స్కూళ్లు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. అలబామా, జార్జియా ప్రాంతాలకూ చలిగాలులు విస్తరించాయని.. రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. సరైన దుస్తులు ధరించకుండా బయటకు వస్తే చలికి 10 నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని ఇండియానా పోలీస్ చీఫ్ గ్రెగ్ బల్లార్డ్ చెప్పారు.

  • Loading...

More Telugu News