: ‘పవర్’ పిల్లోలు వస్తున్నాయోచ్...!
తలగడలు కేవలం మన తలకింద మెత్తగా ఉండేందుకు మాత్రమే కాకుండా మన సెల్‌ఫోన్‌కు లేదా మన ల్యాప్ట్యాప్కు చార్జింగ్ చేసేవిగా ఉంటే... అప్పుడు అవి నిజంగా పవర్ పిల్లోలే. ఇలాంటి సరికొత్త పిల్లోలు త్వరలోనే మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ సరికొత్త పిల్లోలతో చక్కగా మన సెల్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జింగ్ చేసుకోవచ్చని దీన్ని తయారుచేసిన వారు చెబుతున్నారు.
కెనడాకు చెందిన ఇద్దరు పరిశోధకులు సరికొత్త దిండ్లను తయారుచేశారు. ఇవి చూసేందుకే కాదు... చక్కగా వీటి ఉపయోగంలో కూడా స్మార్ట్ అనిపించుకుంటున్నాయి. సాధారణ దిండులాగా కనిపించే వీటిని పవర్ పిల్లోగా పిలుస్తున్నారు. ఈ పవర్ పిల్లోలతో చక్కగా మీ సెల్ఫోన్లకు, ల్యాప్‌ట్యాప్‌లు, లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు పవర్ అందించుకోవచ్చు. ఇందులో లిథియం పాలిమర్ బ్యాటరీలతోబాటు రెండు యుఎస్బి పోర్టులను కూడా వీటికి అమర్చారు. వీటి సాయంతో చక్కగా మన సెల్, ల్యాప్‌ట్యాప్‌లకు చార్జింగ్ చేసుకోవచ్చని దీని తయారుచేసినవారు చెబుతున్నారు.