: ఎలక్షన్ కమిషన్-గూగుల్ టైఅప్ పై ఆందోళనలు
ఎలక్షన్ కమిషన్-గూగుల్ టై అప్ కావడంపై కాంగ్రెస్, బీజేపీ ఆందోళన వ్యక్తం చేశాయి. ఓటర్లు ఆన్ లైన్ లో తమ పేర్లను నమోదు చేసుకోవడంతోపాటు, ఓటర్ల జాబితాలో తమ పేరును సరిచూసుకునేందుకు వీలు కల్పించేలా..ఎలక్షన్ కమిషన్ గూగుల్ టెక్నాలజీని వినియోగించుకోనుంది. ఇది చాలా సున్నితమైన అంశమని, ఈ విషయంలో పార్టీలను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం ఏంటని ఏఐసీసీ కార్యదర్శి కేసీ మిట్టల్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని ముందుగా అన్ని పార్టీలతో చర్చించాక నిర్ణయం తీసుకుని ఉంటే బావుండేదని బీజేపీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వి అన్నారు. సైబర్ సెక్యూరిటీ నిపుణులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతీయుల సమాచారం విషయంలో విదేశీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం సురక్షితం కాదంటున్నారు.