: సామాజిక నెట్ వర్క్ లో ఉదయ్ కిరణ్ కు వెల్లువెత్తిన అభిమానం


సామాజిక నెట్ వర్క్ లు ఫేస్ బుక్, ట్విట్టర్ లలో సినీనటుడు ఉదయ్ కిరణ్ మృతిపై సానుభూతి వెల్లువెత్తింది. ఫేస్ బుక్ అకౌంట్ ఉన్న ప్రతి తెలుగు సినీ అభిమాని తమ హోం పేజి 'వాల్' పైన అతని ఆత్మకు శాంతి చేకూరాలని.. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో (RIP) అనే సందేశమే దర్శనమిచ్చింది. కొందరు అభిమానులు ఉదయ్ కిరణ్ చేసింది తప్పా? రైటా? అంటూ డిబేట్ నడిపించారు. 'ఉదయ్ వి మిస్ యూ' అంటూ పలువురు పోస్ట్ చేశారు. సినిమాలు లేక చాలా కాలం దూరంగా ఉన్నా ఉదయ్ కిరణ్ ను అభిమానులు మర్చిపోలేదనడానికి సామాజిక నెట్ వర్క్ లో వెల్లువెత్తిన అభిమానమే నిదర్శనం.

  • Loading...

More Telugu News