: స్పీకర్ కు లేఖ రాయనున్న టీ ఎమ్మెల్యేలు
స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు లేఖ రాయాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు నిర్ణయించారు. రాష్ట్ర పునర్విభజన బిల్లులో సవరణల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని లేఖలో తెలపనున్నారు. బిల్లుపై శాసనసభలో సవరణలు ప్రతిపాదించే వీల్లేదని, ఎలాంటి సవరణలు చేసినా పార్లమెంటులోనే చేయాలని డిమాండ్ చేయనున్నారు. ఈ మేరకు జానారెడ్డి ఛాంబర్ లో భేటీ అయిన తెలంగాణ ప్రాంత నేతలు పైవిధంగా నిర్ణయం తీసుకున్నారు.