: ఏటీఏంలో 5 లావాదేవీలు దాటితే బాదుడే!
జేబులో ఏటీఎం కార్డున్నా.. దాంతో ఏటీఎం సెంటర్ కు వెళ్లి వాడుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించే రోజులు రానున్నాయి. నెలలో ఐదు ఉచిత లావాదేవీలనే అనుమతించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రతిపాదించింది. రిజర్వ్ బ్యాంకు ఆమోదం తెలిపితే ఇది అమల్లోకి వస్తుంది. ఇటీవలి కాలంలో ఏటీఎం కేంద్రాల్లో దాడులు, దోపిడీలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతను పెంచాలంటూ ప్రభుత్వాలు బ్యాంకులను ఆదేశిస్తున్నాయి. భద్రతను పెంచడం వల్ల బ్యాంకులపై వ్యయం పెరిగిపోతుంది. అందుకే నెలలో 5 లావాదేవీలను ఉచితంగా అనుమతించి.. ఆ తర్వాత జరిగే ప్రతీ లావాదేవీపై చార్జీలు వసూలు చేయాలన్నది బ్యాంకుల యోచన. అలా వచ్చే ఆదాయాన్ని భద్రత కోసం వినియోగించనున్నాయి.