: ఈ నెల 23 తర్వాత కఠిన నిర్ణయాలు తీసుకుంటా: గంటా
తాను పార్టీ మారబోతున్నానంటూ వస్తున్న వార్తలకు త్వరలో తెరదించుతానని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 23 తర్వాత కఠిన నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో కొనసాగాలో లేదో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. ఒక బలమైన సామాజిక వర్గం కోసం అన్ని పార్టీలు ప్రయాత్నాలు చేస్తున్నాయని గంటా పేర్కొన్నారు. కాగా, టి ముసాయిదా బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకుంటున్న వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.