: షూమాకర్ పరిస్థితిలో కొద్దిగా మెరుగు
ఆల్ప్స్ పర్వతాల్లో మంచుపై స్కీయింగ్ చేస్తూ గాయపడి కోమాలోకి వెళ్లిన ఫార్ములా వన్ మాజీ రేసర్ షూమాకర్ పరిస్థితి కొద్దిగా మెరుగైంది. డిసెంబర్ 29న ఘటన జరగ్గా అప్పటి నుంచీ షూమాకర్ కోమాలోనే ఉన్నాడు. అయితే, అతడి పరిస్థితిలో కొద్దిగా మార్పు కనిపించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయినా అతడి పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉంది.