: సోనీ స్మార్ట్ బ్యాండ్


సోనీ మరో స్మార్ట్ గాడ్జెట్ ను ఆవిష్కరించింది. అదే స్మార్ట్ బ్యాండ్. దీన్ని చేతికి వాచ్ లా ధరిస్తే చాలు.. రోజంతా మీరు చేస్తున్న పనులన్నింటినీ రికార్డు చేస్తుంది. కాకపోతే లైఫ్ లాంగ్ అనే అప్లికేషన్ తో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ తో అనుసంధానం చేసుకోవాలి. దీనికి స్క్రీన్ ఉండదు. కాల్స్ వచ్చినప్పుడు వైబ్రేట్ అవుతుంది. అలాగే స్మార్ట్ ఫోన్ ద్వారా పాటలు వింటుంటే ఈ రిస్ట్ బాండ్ ద్వారానే ఆఫ్, ఆన్ చేయవచ్చు. ఇది వాటర్ ప్రూఫ్. దీని ధర ఎంతన్నదీ సోనీ వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News