: ఫ్లోర్ లీడర్ల అభిప్రాయాలు శాసనసభలోనే తెలుసుకోవాలి: బొత్స
ఫ్లోర్ లీడర్ల అభిప్రాయాలను బీఏసీ సమావేశంలో కాకుండా శాసనసభలోనే తీసుకోవాలని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై ఫ్లోర్ లీడర్లు బీఏసీ సమావేశంలో ఓ మాట, అసెంబ్లీలో మరో మాట చెబుతున్నారని మండిపడ్డారు. అందుకే వారి అభిప్రాయాలను శాసనసభలో తెలుసుకుంటే వారి అసలు రంగు బయటపడుతుందని ఆయన అన్నారు. బీఏసీ సమావేశంలో వైఎస్సార్సీపీ సమైక్యతీర్మానానికి పట్టుపడుతుండగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం రెండు రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.