: కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుకు ఏఐసీసీ ప్రతినిధుల కసరత్తు షురూ
రానున్న ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభకు బరిలో నిలిపే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అధిష్ఠానం నుంచి ముగ్గురు ఏఐసీసీ ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను గాంధీ భవన్ లో కలిసి అభ్యర్థుల ఎంపికపై ప్రాధమికంగా చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో వీరు ముగ్గురూ క్షేత్రస్థాయి పర్యటన చేసి అభ్యర్థులను నిర్ణయించనున్నారు. అనంతరం ఈ నెల 13న అధిష్ఠానానికి ఏఐసీసీ ప్రతినిధులు నివేదిక అందజేస్తారు. ఆ నివేదిక ఆధారంగా అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేయనుంది.