: 20 రాష్ట్రాల నుంచి లోక్ సభ ఎన్నికల్లో ఏఏపీ పోటీ చేస్తుందట!
కొత్త పార్టీ అయినప్పటికీ ఢిల్లీ ఎన్నికల్లో గెలుపు రుచి చూసి ఏకంగా ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు దేశంలోని ఇరవై రాష్ట్రాల నుంచి ఏఏపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో 80 లోక్ సభ స్థానాల నుంచి పోటీకి దిగుతుందని చెప్పారు. అలాగే, ఈ ఎన్నికల్లో అమేథీ నుంచి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తమ పార్టీ నుంచి కుమార్ విశ్వాస్ పోటీకి దిగుతారని పేర్కొన్నారు.