: మాపై ఉన్న నమ్మకాన్ని నిలబెడతాం: అశోక్ బాబు
ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఏపీ ఎన్జీవో భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాము శాయశక్తుల ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. ఉద్యమంలో ఉద్యోగులను ఎలా భాగస్వామ్యం చేయాలనే విషయాన్ని ఆలోచిస్తున్నామని అశోక్ బాబు చెప్పారు. ఈ నెల 16 నుంచి 23వ తేదీ వరకు జరిగే శాసనసభ సమావేశాలు కీలకమని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంత నేతలు ముసాయిదా బిల్లుపై చర్చించి తమ అభిప్రాయాలు వెల్లడించాల్సిందిగా కోరుతున్నామని ఆయన చెప్పారు.