: జాతకాలు బయటపడతాయని టీడీపీ, వైఎస్సార్సీపీలు భయపడుతున్నాయి: శైలజానాథ్


టీడీపీ, వైఎస్సార్సీపీల జాతకాలు బయటపడతాయనే చర్చకు భయపడుతున్నారని మంత్రి శైలజానాథ్ తెలిపారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆ రెండు పార్టీలు చర్చను అసెంబ్లీలో అడ్డుకుంటూ విభజనకు సహకరిస్తున్నాయని విమర్శించారు. బిల్లుపై లిఖిత పూర్వక సవరణలు ప్రతిపాదిస్తామని, లిఖిత పూర్వక అభిప్రాయాలు చెబుతామని శైలజానాథ్ చెప్పారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం చర్చకు సహకరించాలని మంత్రి శైలజానాథ్ కోరారు.

  • Loading...

More Telugu News