: వైఎస్ లేకపోవడంతోనే రాష్ట్రంతో చదరంగం ఆడుతున్నారు: జగన్


వైఎస్సార్ లేకపోవడంతోనే కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్రంతో చదరంగం ఆడుతోందని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అన్నారు. సమైక్య శంఖారావం సందర్భంగా, చిత్తూరు జిల్లా నీరుగట్టువారి పల్లెలో ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీకి పట్టం కట్టేందుకు రాష్ట్రాన్ని ముక్కలు చేస్తూ కొత్త రాజకీయాలకు తెరతీశారని అన్నారు. కుల, మతాలకతీతంగా రాజశేఖర్ రెడ్డి లబ్ది చేకూర్చారని ఆయన గుర్తు చేశారు. విభజన జరిగితే రాష్ట్రం ఎడారిగా మారుతుందని అన్నారు.

విభజన వల్ల రెండు ప్రాంతాలకు నష్టమేనని ఆయన అన్నారు. అందుకే రానున్న ఎన్నికల్లో 30 లోక్ సభ సీట్లను గెలుచుకుని సమైక్యానికి మద్దతిచ్చేవారినే ప్రధానిని చేద్దామని జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రం విడిపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని, ఉన్నత విద్య ఎలా కొనసాగుంతుందని కిరణ్, చంద్రబాబులను చొక్కాపుచ్చుకుని నిలదీయాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News