: ఆ దేవాలయంలో పంచామృతానికి చాలా డిమాండ్
పాలు, పెరుగు, నెయ్యి, తేనె, అరటిపండ్లతో చేసే పంచామృతం రుచిచూసిన వారు ఇంకాస్త.. మరికాస్త అని అనకుండా ఉండలేరు. దాని రుచి అంత అద్భుతం. తమిళనాడులోని పళనిలో ఉన్న దండయుతపాణి స్వామి ఆలయంలో ప్రసాదంగా అందించే పంచామృతం అయితే ఎంతో ఫేమస్. పోయిన నవంబర్ 17 నుంచి డిసెంబర్ 22 వరకు నెల రోజుల్లోనే అక్కడ 6.76కోట్ల రూపాయల విలువైన 13,47,157 కిలోల పంచామృతాన్ని విక్రయించారు. ఈ ప్రసాదానికి డిమాండ్ పెరిగిపోవడంతో మరో ప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. రోజుకు లక్ష మందికి పైగా భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు.