: వాహనాల తనిఖీలో పట్టుబడ్డ రూ.1.6 కోట్లు


ఖమ్మం జిల్లాలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు రూ. 1.6కోట్లు పట్టుబడ్డాయి. గత రాత్రి నిర్వహించిన తనిఖీల్లో ఒక కారు నుంచి ఇంత డబ్బుతో కూడిన బ్యాగును స్వాధీనం చేసుకున్నట్లు ఖమ్మం జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ ఈ ఉదయం తెలిపారు. భద్రాచలం డివిజన్ లోని చర్ల ప్రాంతానికి చెందిన రైతుల సొమ్ముగా కనిపిస్తోందని.. దీన్ని తూర్పుగోదావరి జిల్లా మండపేటలో కమిషన్ ఏజెంట్ కు అందజేయడానికి తీసుకెళుతున్నారని చెప్పారు. దీనిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.

  • Loading...

More Telugu News