: అతి తక్కువ వృద్ధి రేటు దిశగా చైనా
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా 1999 తర్వాత అత్యంత తక్కువ వృద్ధి రేటును నమోదు చేయనుంది. పారిశ్రామిక, సర్వీసుల రంగం నెమ్మదించినట్లు తాజాగా వెల్లడైన డిసెంబర్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మౌలిక ఆర్థిక వృద్ధి నాలుగో త్రైమాసికంలో తగ్గిపోవచ్చని భావిస్తున్నారు. నాలుగో త్రైమాసికంతోపాటు, 2013 ఏడాదికి సంబంధించిన ఆర్థిక గణాంకాలను చైనా జాతీయ గణాంకాల బ్యూరో ఈ నెలాఖర్లో వెల్లడించనుంది. చైనాలో వృద్ధి తగ్గడం ఆసియా స్టాక్ మార్కెట్ల సెంటిమెంట్ పై ప్రభావం చూపవచ్చు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.