: హిందువులందర్నీ సంఘటితపరచాలి: ప్రవీణ్ తొగాడియా


హిందువులందర్నీ సంఘటితపరచాలని, అందుకు అందరూ కృషి చేయాలని విశ్వహిందూ పరిషత్ (వీ.హెచ్.పీ) అంతర్జాతీయ అధ్యక్షులు ప్రవీణ్ తొగాడియా అన్నారు. ఈ రోజు (సోమవారం) ఉదయం మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ నివాసంలో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తొగాడియా వీ.హెచ్.పీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. హిందువులు అన్ని రంగాల్లో వెనుకబడుతున్నారని, వారి ఐక్యత కోసం పాటుపడాలని ఆయన సూచించారు. అనంతరం కార్యకర్తలు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వీ.హెచ్.పీ కార్యదర్శి గోపాల్, జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News