: మీ ప్రార్థనలతో అమ్మమ్మ ఆరోగ్యం మెరుగైంది: రైమాసేన్
తన అమ్మమ్మ సుచిత్రా సేన్ ఆరోగ్యం మెరుగైందని బాలీవుడ్ నటి రైమాసేన్ ట్విట్టర్లో పేర్కొంది. తన అమ్మమ్మ కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. అలాగే ప్రార్థనలు అందించాలని కోరింది. సుచిత్రా సేన్ తీవ్ర ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో కోల్ కతాలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. సుచిత్రా సేన్ కూతురు మూన్ మూన్ సేన్ కూమార్తే రైమాసేన్. రైమాసేన్ తెలుగులో 'ధైర్యం' సినిమాలో నటించింది.