: దేశంలోనే గొప్ప న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి.. 7 కోట్లకు మోసపోయిన వైనం!
కేంద్ర మాజీ మంత్రి, దేశంలోనే గొప్ప న్యాయవాదిగా పేరున్న రాంజెఠ్మలానీ చెన్నైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ మధ్యవర్తి చేతిలో 7 కోట్ల రూపాయలకు మోసపోయారు. చెన్నైలోని ముఖ్య ప్రాంతాల్లో ఏవైనా భూములు అమ్మకానికి ఉంటే తెలపాలని రాంజెఠ్మలానీ, అతని ఇద్దరు స్నేహితులు ఓ మధ్యవర్తిని ఆన్ లైన్ లో సంప్రదించారు.
దీంతో ఆ బ్రోకర్ నగరం మధ్యలో మంచి స్థలం అమ్మకానికి సిద్ధంగా ఉందన్నాడు. కానీ రాంజెఠ్మలానీ లాంటి వారితో టచ్ లో ఉన్నానన్న విషయాన్ని ఆ స్థలం యజమాని నమ్మడం లేదని చెప్పాడు. స్థలం యజమానికి విశ్వాసం కలిగించాలంటే ముందుగా 7 కోట్ల రూపాయలు చెల్లించాలని బ్రోకర్ సూచించాడు. దీంతో అతడిని నమ్మిన రాంజెఠ్మలానీ 7 కోట్ల రూపాయలు చెల్లించారు. అంతే, డబ్బులు చేజిక్కించుకున్న అతను పత్తా లేకుండా పోయాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.