: భవనం కూలిన ఘటనలో 14కు పెరిగిన మృతులు


గోవాలోని కెనకోనా పట్టణంలో నిన్న మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న భవనం కూలడంతో మృతి చెందిన వారి సంఖ్య 14కు పెరిగింది. 21 మందిని ఇప్పటి వరకూ రక్షించారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 360 మంది ఆర్మీ జవాన్లు ఇందులో పాల్గొంటున్నారు. అయితే, ఇంకా 60 మంది వరకూ శిధిలాల కింద చిక్కుకుని ఉంటారనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు బిల్డర్ తోపాటు నిర్మాణానికి అనుమతి జారీ చేసిన మునిసిపల్ అధికారులపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News