: రాష్ట్రంలో నిర్ణయ చట్టం పనిచేయడం లేదు: చంద్రబాబు


రాష్ట్రంలో నిర్భయ చట్టం ఏ మాత్రం పనిచేయడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇవాళ (శనివారం) హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పెద్ద సంఖ్యలో డ్వాక్రా మహిళా సంఘాల వారు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా బాబు వారితో మాట్లాడారు. వారి సాధకబాధకాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నిర్భయ చట్టం అమల్లోకి వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని ఆయన అన్నారు. అత్యాచారానికి పాల్పడ్డ వారికి ఉరిశిక్ష విధిస్తేనే కానీ అఘాయిత్యాలు ఆగవని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మహిళలు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడు తాగడానికి మంచినీళ్లు లేవు కాని, మద్యం మాత్రం పుష్కలంగా దొరుకుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News