: ఈ ఏడాది లోక్ సభ ఎన్నికల్లో నేను పోటీ చేయడంలేదు: కేజ్రీవాల్
మరో మూడు నెలల్లో దేశంలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇటీవలే ఢిల్లీలో సీఎం బాధ్యతలు చేపట్టినందువల్లే ఎన్నికల్లో పోటీ చేయకూడదని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే రానున్న లోక్ సభ ఎన్నికలపై దృష్టి పెట్టిన ఆమ్ ఆద్మీ, అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించనుంది.