: ఆ ఆరుగురు చరిత్రలో మిగిలిపోతారు: అశోక్ బాబు
సొంత పార్టీపైనే అవిశ్వాస తీర్మానం పెట్టిన ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు చరిత్రలో మిగిలిపోతారని ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వారు చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ రోజు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు చేపట్టిన దీక్షకు అశోక్ బాబు హాజరై మద్దతు పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎంపీలు తమ దీక్షలను పొడిగిస్తే ఉద్యోగులు కూడా వారికి మద్దతుగా పాల్గొంటారని చెప్పారు. త్వరలోనే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు. సమైక్య ఉద్యమంలో నేతలంతా పార్టీలకతీతంగా పాల్గొనాలని సూచించారు.