: వచ్చే వేసవిలో విద్యుత్ కోతలు ఉండవని భావిస్తున్నాం: ముఖ్యమంత్రి


వచ్చే వేసవికాలంలో విద్యుత్ కోతలు ఉండవని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జూబ్లీహాలులో మీడియాతో మాట్లాడిన సీఎం.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు బాగానే అమలవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం తరపున ఉన్న అన్ని సమస్యలను త్వరలోనే అధిగమిస్తామన్నారు. అయితే, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం 60శాతం వరకు సబ్సీడీ ఇస్తోందని చెప్పిన సీఎం, మైనారిటీలకు రుణాలు ఇవ్వడంలో వెనుకపడినట్లు పేర్కొన్నారు. మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాల్సి ఉందని.. వారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. అంతేకాక సోలార్ విద్యుత్ పరికరాలకు రుణాలు విరివిగా ఇవ్వాలని బ్యాంకులకు విన్నవించారు.

  • Loading...

More Telugu News