: 13 నెలల్లో 47 అవినీతి కేసులు పరిష్కరించిన సీబీఐ


దేశంలో అవినీతి అంతకంతకు పెరిగిపోతుండడంతో సీబీఐ అధికారులకు అస్సలు ఖాళీ వుండడం లేదట. కేసు మీద కేసు వచ్చి పడిపోతోంది. ఈ క్రమంలో.. 13 నెలల్లో 47 అవినీతి కేసులను సీబీఐ అధికారులు పరిశోధించి, కేసులు రిజిస్టర్ చేశారని ప్రభుత్వం తెలిపింది. గురువారం రాజ్యసభ సమావేశాల్లో భాగంగా.. పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పింఛన్ల మంత్రి వి. నారాయణ స్వామి మాట్లాడుతూ.. 2012లో 45 కేసులను, మరో 2 కేసులను 2013 జనవరిలో మూసివేసినట్లు తెలిపారు.

ఇందులో ఢిల్లీ బ్రాంచ్
 అధికారులు గరిష్ఠంగా 10 కేసులను పరిశోధించినట్లు తెలిపారు. కాగా, అవినీతి నిరోధక చట్టం కింద 2010, 2011, 2012లో 1,997 కేసులను సీబీఐ నమోదు చేసిందని వెల్లడించారు. వీటిలో నాలుగు కేసులు కామన్ వెల్త్ గేమ్స్ వ్యవహారానికి సంబంధించినవేనని చెప్పారు. ఆ కేసుల్లోనూ విచారణ ముగిసిందన్నారు.

  • Loading...

More Telugu News