: మోత్కుపల్లికి బుద్ధి లేదు: కొప్పుల ఈశ్వర్
అందరూ తెలంగాణ బిల్లుపై చర్చ జరగాలంటూ మాట్లాడుతుంటే... టీడీపీ నేత మోత్కుపల్లి మాత్రం కేసీఆర్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. కేసీఆర్ వ్యవసాయం చేసినా తప్పేనా? అని ప్రశ్నించారు. మోత్కుపల్లికి బుద్ధి లేదని... అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు.