: యూపీని విభజించకుండా ఏపీ విభజనేంటి?: విజయమ్మ
20 కోట్ల మంది జనాభా, నాలుగు ప్రాంతీయ వాదాలు ఉన్న ఉత్తరప్రదేశ్ ను విభజించకుండా ఎనిమిదిన్నర కోట్ల మంది ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఎలా విభజిస్తారని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం, సంప్రదాయం ప్రకారం విభజన జరగాలని, అలాంటిది కనీస సంప్రదాయాలు పాటించకుండా అడ్డదిడ్డంగా విభజన ఏంటని నిలదీశారు. చిదంబరం ప్రకటనలో రాజకీయ ఉద్దేశాలు కనిపిస్తున్నాయని ఆమె విమర్శించారు. విభజన జరిగితే శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ఉప్పునీళ్లే గతని ఆమె అభిప్రాయపడ్డారు. బాబు అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలే రాష్ట్రానికి శాపాలుగా మారాయని విజయమ్మ ఆరోపించారు.