: అసెంబ్లీ సోమవారానికి వాయిదా
ఈ రోజు అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం ప్రారంభమైనప్పటి నుంచి ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు సభను కొనసాగనివ్వలేదు. స్పీకర్ పోడియంలోకి చొచ్చుకొచ్చి జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. దీనికి తోడు మరికొందరు సీమాంధ్ర ఎమ్మెల్యేలు బిల్లు కాపీలను చింపి పోడియం దగ్గర విసిరేశారు. సభను కొనసాగనివ్వాలని, చర్చకు సహకరించాలని స్పీకర్ నాదెండ్ల పదేపదే విజ్ఞప్తి చేసినా... ఎవరూ పట్టించుకోలేదు. దీంతో, విధిలేని పరిస్థితుల్లో సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.