: రాజస్థాన్ రాయల్స్ కు షేన్ వాట్సన్ నాయకత్వం?


రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 2014లో జరిగే తదుపరి ఐపీఎల్ సీజన్-7 లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ నాయకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల వేలంపాటతో సంబంధం లేకుండా రాజస్థాన్ రాయల్స్ జట్టులోనే కొనసాగడానికి వాట్సన్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ కు బదులుగా వాట్సన్ ను కెప్టెన్ గా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం నియమించనుందని తెలుస్తోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు 7వ సీజన్ కు తమ జట్లలోనే కొనసాగే ఆటగాళ్ల జాబితాను ఈ నెల 10లోపు అందించాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News