: '11 మంది బాలికలపై అత్యాచారమా? ఎలా జరిగిందీ దారుణం'


నల్గొండ జిల్లాలో 11 మంది గిరిజన బాలికలపై ట్యూటర్ అత్యాచారం చేసిన ఘటనపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలుగా దారుణం జరుగుతుంటే ఎందుకు గుర్తించలేకపోయారని మండిపడ్డారు. తక్షణం దీనిపై సమగ్ర విచారణ జరిపి సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ ను ఆదేశించారు.

నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని తండాలో ఓ ఆశ్రమ పాఠశాలలో 11 ఏళ్లలోపు బాలికలు 11 మందిపై మూడు నెలలుగా ట్యూటర్ హరీష్ అత్యాచారం చేస్తున్నాడు. ఓ బాలిక ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూడగా నిందితుడు పరారయ్యాడు. అతనిని తక్షణం అరెస్టు చేయాలంటూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు.

  • Loading...

More Telugu News