: నొప్పి మాత్రలతో కిడ్నీలకు ముప్పు


ఉన్నట్లుండి తలనొప్పి ప్రారంభమైంది. మరొకరికి ఒళ్లు నొప్పులు. 'ఈ బాధను భరించలేమురా నాయనా' అనుకుంటూ దగ్గర్లో ఉన్న మందుల దుకాణం లేదా, కిరణా దుకాణానికో వెళ్లి నొప్పి నివారణ మాత్రలు (పెయిన్ కిల్లర్స్) తెచ్చుకుని మింగేయడం చాలా మందికి అలవాటు. కానీ అలా ఇష్టానుసారంగా వాడేస్తే చేతులారా మీ మూత్ర పిండాలకు హాని చేసుకున్నట్లేనని హైదరాబాద్ లోని నిమ్స్, డెక్కన్ ఆస్పత్రి వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

పెయిన్ కిల్లర్స్ ను వాడటం వల్ల ఏటా మూత్రపిండాల వ్యాధిన పడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సెలెకాక్సిబ్, ఫెన్ సెటిన్, అసెమినోటిన్, ఐబూప్రోఫెన్, డైక్లోమెనాక్ సోడియం తదితర మందుల వాడకం రాష్ట్రంలో ఎక్కువగా ఉందని చెబుతున్నారు. వీటిని వాడటం వల్ల దీర్ఘకాలంలో మూత్రపిండాలు విఫలమై ప్రాణాంతకమవుతుందని హెచ్చరిస్తున్నారు.
 
దేశంలో ఏటా తీవ్ర కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య 4 లక్షల వరకూ ఉంటోందని.. వీటిలో 10శాతం నొప్పి నివారణ మాత్రల వాడకం వల్ల వస్తున్నవేనని నిపుణులు వెల్లడించారు. కనుక నొప్పి వచ్చని వెంటనే మందులను ఆశ్రయించడం మానుకోండి. 

  • Loading...

More Telugu News