: తెలంగాణప్రదేశ్గా పేరు మార్చుదాం.. 20 ఏళ్ల పాటు పాలించండి: రాయపాటి
ఆంధ్రప్రదేశ్ పేరుతోనే తెలంగాణ నేతలు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నారని... కావాలంటే రాష్ట్రం పేరును తెలంగాణప్రదేశ్ గా మార్చుకుందామని ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. హైదరబాద్ లో సంకల్ప దీక్షా శిబిరం వద్ద ఆయన మాట్లాడుతూ, 'కావాలంటే రాష్ట్రాన్ని 20 ఏళ్ల పాటు తెలంగాణ నేతలే పాలించుకోండి' అని సూచించారు. రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనను చివరి వరకు అడ్డుకుందామని ఆయన తెలిపారు.