: ఢిల్లీలో అమెరికన్ ఎంబసీపై మరికొన్ని ఆంక్షలు


మన దౌత్యవేత్తను అవమానించిన అమెరికాకు తగు జవాబుపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ఆంక్షలతో ఝలక్ ఇవ్వగా.. తాజాగా ఢిల్లీలోని అమెరికన్ సెంటర్ (అమెరికన్ ఎంబసీ ఆధర్యంలో పనిచేస్తుంది) లో ఎలాంటి చిత్రాలను ప్రదర్శించరాదని ఆదేశించింది. ఇందుకు ఈ నెల 20 గడువుగా పేర్కొంది. ఆ తర్వాత చిత్రాలను ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటారు.

ఢిల్లీలోని అమెరికన్ సెంటర్ తరచుగా చిత్రాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆహ్వానిస్తుంటుంది. ఇందుకు ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు లేవు. ఇప్పుడు దీన్ని అవకాశంగా కేంద్రం భావించి ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఇలాంటి నిబంధనల ఉల్లంఘన కుదరదని స్పష్టం చేసింది. చట్టం ప్రకారం లైసెన్స్ తీసుకున్న తర్వాతే చిత్రాలను ప్రదర్శించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

  • Loading...

More Telugu News