: జీఎస్ఎల్ వీ డీ-5 ఉపగ్రహానికి కౌంట్ డౌన్ ప్రారంభం
జీఎస్ఎల్ వీ డీ-5 ఉపగ్రహ ప్రయోగానికి ఈ రోజు నుంచి 29 గంటల కౌంట్ డౌన్ ప్రకియ ప్రారంభమైంది. రేపు సాయంత్రం 4.18 గంటలకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్ వీ డీ-5 వాహక నౌక నిర్దేశిత కక్ష్యలోకి దూసుకెళ్లనుంది. దీని ద్వారా జీశాట్-14 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టనున్నారు. జీఎస్ఎల్ వీ రాకెట్లో క్రయోజెనిక్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.