: మూడేళ్ల బాలుడిపై దోపిడీ కేసు!


మూడేళ్ల బాలుడు ఆమె తల్లితో కలసి దోపిడీ చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది జరిగింది మన దేశంలో కాదు లెండి. పాకిస్థాన్ లో ఫరూఖ్ బీబీ, అమె కుమారుడు సౌద్ ఓ వ్యక్తిపై బ్లేడు లాంటి పదునైన ఆయుధంతో దాడి చేసి సెల్ ఫోన్, 22 వేల నగదు దోచుకున్నాడని లాహోర్ పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. మహిళ బెయిల్ కోసం దరఖాస్తు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వారిద్దరిపై కేసు నమోదు చేయడం అన్యాయమని.. కుట్రతోనే వారిపై పోలీసులు దొంగతనం కేసులో ఇరికించారని న్యాయవాది వాదించడంతో.. న్యాయస్థానం వారిద్దరికీ బెయిల్ మంజూరు చేసి దర్యాప్తుకు ఆదేశించింది.

  • Loading...

More Telugu News