: ‘పద్మశ్రీ’ కేసు విచారణ 21కి వాయిదా వేసిన హైకోర్టు
‘పద్మశ్రీ’ బిరుదును సినీ నటుడు మోహన్ బాబు, హాస్య నటుడు బ్రహ్మానందం దుర్వినియోగం చేస్తున్నారంటూ బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ కేసు విచారణలో భాగంగా వాదనలు విన్న న్యాయస్థానం సినీ నటులను పద్మశ్రీ బిరుదులను సరెండర్ చేయాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే ‘దేనికైనా రెఢీ’ సినిమాలో తనకు తెలీకుండానే నిర్మాత సినిమా టైటిల్స్ లో పేరుకు ముందు పద్మశ్రీ చేర్చారని బ్రహ్మానందం న్యాయమూర్తికి విన్నవించారు. అయితే.. ‘ఝుమ్మంది నాదం’ సినిమాలో నిర్మాత, నటులకి తెలిసే పేర్లలో పద్మశ్రీ తగిలించుకున్నారని ఇంద్రసేనారెడ్డి మరో పిటీషన్ న్యాయస్థానం ముందుంచారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల చివరి వారానికి వాయిదా వేశారు.