: చిరంజీవితో ముగిసిన ప్రజారాజ్యం ఎమ్మెల్యేల భేటీ


కేంద్రమంత్రి చిరంజీవితో ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు, నేతల భేటీ ముగిసింది. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, సి.రామచంద్రయ్య కూడా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో గంటా మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన, తాజా రాజకీయాలపై తాము చర్చించినట్లు తెలిపారు. అనుమానాలు నివృత్తి చేసుకున్నామని, త్వరలో మరోసారి సమావేశమవుతామని చెప్పారు. ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చిరు చెప్పారన్నారు. కాగా, కాంగ్రెస్ లో ఉంటేనే అందరికీ భవిష్యత్ ఉంటుందని, అయితే, ప్రస్తుతం గెలిచే పరిస్థితిలో కూడా పార్టీ లేదని చిరు ఎమ్మెల్యేలతో అన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News