: శాసనసభ రేపటికి వాయిదా
శాసనసభ రేపటికి వాయిదా పడింది. రెండుసార్లు వాయిదా పడిన అనంతరం ప్రారంభమైన సభలో తెలంగాణ, సీమాంధ్ర ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేశారు. స్పీకర్ ఎంత వారించినా సభ్యులు వినకపోవడంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.