: ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధమేనని రాహుల్ అన్నారు: యనమల


తాను ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధమని గతంలో రాహుల్ గాంధీ అన్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు గుర్తు చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, యూపీఏ తీరుతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ను రాహుల్ ముందుగానే అంచనా వేసి ప్రతిపక్షంలో కూర్చుంటానని అన్నారని ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ చేతిలో ప్రధాని కీలు బొమ్మగా మారారని, ఆయన దేశాన్ని పరిపాలించిన దాఖలాలు లేవని మండిపడ్డారు. దేశ చరిత్రలో మన్మోహన్ సింగ్ రోబో ప్రధానిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. యూపీఏకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ భవిష్యత్ లేదని యనమల స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News