: సీమాంధ్ర ఎడారిగా మారుతుంది: భూమన
విభజన బిల్లుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పూర్తిగా సహకరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఇరు ప్రాంతాల్లోని టీడీపీ నేతలతో కలసి చంద్రబాబు నాటకాలాడుతున్నారని చెప్పారు. కేవలం వైఎస్సార్సీపీ మాత్రమే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకోసం తీర్మానం చేయాలని పట్టుబడుతోందని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాలు తీర్మానం తర్వాతే ఏర్పడ్డాయని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే జల వివాదాలు తలెత్తుతాయని... సీమాంధ్ర నీటి సమస్యతో అల్లాడుతుందని, ఎడారిగా మారుతుందని అన్నారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.