: నేడు రాష్ట్ర బంద్ కు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు
సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నేతృత్వంలో ఈ రోజు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చినట్టు వేదిక చైర్మన్ అశోక్ బాబు తెలిపారు. బంద్ లో ఏపీఎన్జీవోలు సహా పలు ఉద్యోగ సంఘాలు పాల్గొంటున్నట్టు ఆయన అన్నారు. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు, సమాజ్ వాదీ పార్టీ మద్దతిస్తున్నాయని చెప్పారు. తెలంగాణాలో కూడా సమైక్యవాదులు ఉన్నందునే రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చినట్టు ఆయన వివరించారు.