: వైఎస్సార్సీపీ నేత జూపూడికి చేదు అనుభవం
వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకరరావుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకలలో ఆయన్ను ఎమ్మార్పీఎస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తామంటేనే గ్రామంలోకి అనుమతిస్తామని వారు తేల్చిచెప్పారు. దీంతో కొంత సేపు అక్కడ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు పోలీసుల అండతో ఆయన అక్కడ నుంచి క్షేమంగా బయటపడ్డారు.