: సీఎంకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన జగ్గారెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సమైక్య రాష్ట్రం కోసం సీఎం చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావాలని కోరుకున్నట్లు అనంతరం చెప్పారు. రాష్ట్రానికి కిరణ్ మంచి పాలన అందిస్తున్నారని, విజయవంతమైన పాలన అందించాలని ఆయనను కోరినట్లు చెప్పారు.