: సీఎంను వ్యతిరేకించేవారు పదవులకు రాజీనామా చేస్తే బాగుంటుంది: టీజీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేకించేవారు, ఆయన అధికారాలను ప్రశ్నించేవారు పదవులకు రాజీనామా చేసి మాట్లాడితే బాగుంటుందని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ శ్రీధర్ బాబు శాఖ మార్పు తమకు వ్యతిరేకమనుకుంటే తెలంగాణ మంత్రులు రాజీనామా చేయాలని సూచించారు. శాసనసభలో సమైక్య తీర్మానం తరువాతే తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.