: హుటాహుటిన హైదరాబాద్ విచ్చేసిన ఏఐసీసీ కార్యదర్శి


మంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్పుతో రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై పార్టీలతో సంబంధం లేకుండా... తెలంగాణ ప్రాంత నేతలంతా సీఎం కిరణ్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. తాజాగా ఈ వ్యవహారంలో ఏఐసీసీ తల దూర్చింది. ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా ఈ ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రుల శాఖలను మార్చే విషయంలో ముఖ్యమంత్రికి పూర్తి అధికారాలు ఉంటాయని చెప్పారు. అంతేకాకుండా, సీఎం కిరణ్, తెలంగాణ మంత్రులు, వివాదానికి కేంద్ర బిందువు అయిన శ్రీధర్ బాబుతో ఈ రోజు తాను సమావేశమవుతానని కుంతియా తెలిపారు. రేపు అసెంబ్లీ సమావేశాలు పున:ప్రారంభం కానుండటంతో, రామచంద్ర కుంతియా హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

  • Loading...

More Telugu News