: వైష్ణోదేవి ఆలయంలో భారీ హిమపాతం
వైష్ణోదేవి ఆలయ పరిసరాల్లో భారీ హిమపాతం కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లోని త్రికూట పర్వతాల్లో, రూసీ జిల్లాలో భారీగా మంచు కురుస్తోంది. అయితే, కొత్త సంవత్సరాది కావటంతో హిమపాతాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు వైష్ణోదేవి ఆలయానికి చేరుకొని ఇవాళ అమ్మవారిని దర్శించుకొన్నారు. అమ్మవారి గుహాలయంతో పాటు త్రికూట పర్వతాల్లో నిన్న (మంగళవారం) రాత్రంతా మంచు కురుస్తూనే ఉందని వైష్ణోదేవి ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారి ఆలయంలో అడుగు మేర మంచు పేరుకొని ఉందని, భరోవ్ ఘాటీలో అడుగు కంటే ఎక్కువగా మంచు ఉందని వారు చెప్పారు. చలి గాలులు వీస్తున్నా.. గత రెండు రోజుల నుంచి సుమారు 45 వేల మంది యాత్రీకులు కత్రాకు చేరుకొన్నారు. కత్రాలో బస చేసి అక్కడ నుంచి అమ్మవారి గుహాలయానికి వస్తున్న యాత్రీకులకు దర్శనం సజావుగా సాగడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త సంవత్సరాది సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.