: యుద్ధం వస్తే పెను ప్రమాదమే.. అమెరికా సురక్షితం కాదు: ఉత్తర కొరియా
కొరియా ద్వీపకల్పంలో పొరపాటున యుద్ధం వస్తే అది పెను అణు విధ్వంసానికి దారితీస్తుందని ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ హెచ్చరిస్తున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సియోల్ లో ఆయన మాట్లాడుతూ యుద్ధం వస్తే అమెరికా సురక్షితంగా ఉండదని స్పష్టం చేశారు. ఇప్పుడు తాము ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నామని దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. పొరపాటున జరిగే చిన్న మిలటరీ పొరపాటు కూడా ప్రపంచాన్ని తుడిచి పెట్టేసే అణువిధ్వంసానికి దారితీస్తుందని ఆయన తెలిపారు. శాంతికోసం ఎవరినీ ప్రాధేయపడబోమన్న కిమ్ జాంగ్, పేదల రక్షణకు నిరంతరం పాటుపడతానని హామీ ఇచ్చారు.