: ఇరవై ఏళ్లు ఆగాం.. ఇక పెళ్లి చేసుకుందాం: 'ఓప్రా విన్ ఫ్రే'కు ప్రియుడి సూచన
అంతర్జాతీయ ఛాట్ షో రారాణి ఓప్రా విన్ ఫ్రే కి 20 ఏళ్ల క్రితం ఎంగేజ్ మెంట్ అయింది. ఇన్నాళ్లూ ఎంగేజ్ మెంట్ తోనే సరిపెట్టుకొచ్చిన ఓప్రాకి... ఈ ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెడదామని ఆమె ప్రియుడు స్టెడ్ మన్ గ్రాహం సూచిస్తున్నాడు. ఎదురు చూపులు చాలు, పెళ్లి చేసుకుందామని సలహా ఇస్తున్నాడు. ఆరేళ్లపాటు డేటింగ్ చేసిన ఓప్రా, గ్రాహంలు 1992లో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఆ తరువాత పెళ్లి చేసుకుందాం అంటూ 20 ఏళ్లు దాటేశారు. ఇప్పుడిక పెళ్లి చేసుకుందామని గ్రాహం ఓప్రా విన్ ఫ్రేకు సూచిస్తున్నాడు.